Social Media X: ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ ప్రారంభించాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే..! ‘ఎక్స్‌’లో కీలక మార్పు

Social Media X: ప్రీమియం చందాదారులను పెంచుకోవడంలో భాగంగా ఇప్పటికే అనేక మార్పులు చేపట్టిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ ప్రారంభించాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురానుంది.

Published : 22 Jun 2024 14:19 IST

Social Media X | ఇంటర్నెట్‌డెస్క్‌: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు (Elon Musk)కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’.. తన ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకొనే పనిలో పడింది. అందులోభాగంగా త్వరలో కొత్త మార్పును తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను ప్రారంభించాలంటే కచ్చితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉండాలని పేర్కొంది. ఈవిషయాన్ని లైవ్‌ ప్రొఫైల్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, టిక్‌టాక్‌.. వంటి సోషల్‌మీడియా వేదికల్లోనూ లైవ్‌ స్ట్రీమింగ్‌ సదుపాయం ఉంది. అయితే వీటిలో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించాలంటే ఎటువంటి ప్రీమియం సభ్యత్వం అవసరం లేదు. రానున్న రోజుల్లో ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మాత్రమే ‘ఎక్స్‌’లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసే సదుపాయం ఉండనుంది. అయితే ఎప్పటినుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయనే విషయం తెలియదు. ‘ఎక్స్‌’ బేసిక్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.215 నుంచి ప్రారంభమవుతుంది.

బడ్జెట్‌ 2024.. రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలమ్మ భేటీ

వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం సైతం పడిపోతున్నట్లు చాలాకాలంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో సబ్‌స్క్రైబర్ల ద్వారా వచ్చే ఆదాయంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు మస్క్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా మార్పులు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు.. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌తో పాటు, లైక్‌, రిప్లయ్‌, బుక్‌మార్క్‌ చేయాలన్నా చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని మస్క్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఫిలిప్పీన్స్‌, న్యూజిలాండ్‌లోని కొత్త యూజర్లకు ఈ రుసుములు వసూలుచేయడం ప్రారంభించింది. అయితే ఫాలో, బ్రౌజింగ్‌ ఉచితంగానే చేయొచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని