Vivo Y58 5G: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో కొత్త ఫోన్‌

Vivo Y58 5G: రూ.20 వేలలోపు ధరతో భారత్‌లో వివో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

Published : 20 Jun 2024 14:34 IST

Vivo Y58 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: వివో భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వై58 5జీ (Vivo Y58 5G) పేరిట దీనిని తీసుకొచ్చింది. ప్రీమియం డిజైన్‌, శక్తిమంతమైన బ్యాటరీ, డ్యుయల్‌ స్టీరియో స్పీకర్‌, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇతర ఫీచర్లు, ధర, లాంఛ్‌ ఆఫర్ల వంటి వివరాలు చూద్దాం..

ఫోన్‌ స్పెసిఫికేషన్లు..

వివో వై58 5జీ (Vivo Y58 5G) హిమాలయన్‌ బ్లూ, సుందర్బన్స్‌ గ్రీన్‌ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేటుతో కూడిన 6.72 అంగుళాల ఎల్‌సీడీ తెరను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌14తో ఇది పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 8జీబీ, స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. 44W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6000 mAh లిథియం ఐయాన్‌ బ్యాటరీని ఇచ్చారు. వెనక f/1.8 + f/2.4 అపెర్చర్‌తో కూడిన 50 MP + 2 MP; ముందు f/2.05 అపెర్చర్‌తో 8 MP కెమెరాను ఇచ్చారు. వైఫై, బ్లూటూత్‌ 5, యూఎస్‌బీ టైప్‌-సి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

వై58 5జీ ధర..

వివో వై58 5జీ ధర (Vivo Y58 5G Price) రూ.19,499. ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తక్షణ రాయితీ లభిస్తుంది. రోజుకు రూ.35 చెల్లించేలా ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌, వివో ఇండియా ఈస్టోర్‌ సహా అన్ని ఎలక్ట్రానిక్‌ రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని