Vizag: ‘కిమ్స్‌’ చేతికి విశాఖ క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌

హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌), విశాఖపట్నంలోని క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌ను సొంతం చేసుకోనుంది.

Updated : 10 Jul 2024 07:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌), విశాఖపట్నంలోని క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌ను సొంతం చేసుకోనుంది. దీనికి సంబంధించి షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌కు యజమానిగా ఉన్న చలసాని హాస్పిటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100% వాటాను కిమ్స్‌ హాస్పిటల్స్‌ కొనుగోలు చేస్తుంది. విశాఖ నడిబొడ్డున ఉన్న క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌లో 200 వైద్య పడకలు ఉన్నాయి. దీనికి దగ్గర్లో మరొక హాస్పిటల్‌ లేకపోవడంతో, ఎక్కువ మంది రోగులు వైద్య సేవల కోసం క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌ను సందర్శిస్తూ ఉంటారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌కు ఇప్పటికే విశాఖపట్నంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మరొక గ్యాస్ట్రో యూనిట్‌ ఉన్నాయి. వీటికి ఇప్పుడు క్వీన్స్‌ ఎన్నారై హాస్పిటల్‌ కూడా జత కలుస్తుంది. కిమ్స్‌ హాస్పిటల్స్‌ 2018లో విశాఖపట్నంలోని కిమ్స్‌-ఐకాన్‌ హాస్పిటల్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో ఆసుపత్రిని కొనుగోలు చేస్తోంది. దీంతో తమకు విశాఖలో 630 వైద్య పడకల సామర్థ్యం గల ఆసుపత్రులు ఉన్నట్లు అవుతుందని కిమ్స్‌ సీఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని