Smartphone launches: 2024 సెకండాఫ్‌లో టెక్‌ ప్రియులకు పండగే.. ‘బ్లాక్‌ బస్టర్‌’ ఫోన్లు క్యూ!

Upcoming smartphones: ఈ ఏడాది రెండో అర్ధభాగంలో యాపిల్‌, శాంసంగ్‌ సహా పలు కంపెనీలు స్మార్ట్‌ఫోన్లు తీసుకురానున్నాయి.

Published : 27 Jun 2024 11:24 IST

Upcoming smartphones | ఇంటర్నెట్ డెస్క్‌: కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు టెక్‌ ప్రియులు. ముఖ్యంగా ఏటా రెండో అర్ధభాగం వైపే వీరి చూపంతా. ఎందుకంటే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లన్నీ అప్పుడే తమ ఫ్లాగ్‌షిప్‌/ ప్రీమియం మోడల్‌ ఫోన్లను విడుదల చేస్తుంటాయి. ఈ ఏడాది కూడా పలు కంపెనీలు కీలక ఈవెంట్లకు సిద్ధమయ్యాయి. యాపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌ వంటి కంపెనీలు తమ ప్రీమియం ఫోన్లను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అవేంటో చూసేయండి..

ఐపీ రేటింగ్‌ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?

  • యాపిల్‌ 16 సిరీస్‌: యాపిల్‌ సంస్థ ఏటా లేటెస్ట్ ఐఫోన్లను లాంచ్‌ చేస్తుంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఈవెంట్‌ను నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేయనుంది. గతంలో మాదిరిగానే 16 సిరీస్‌లో బేస్‌ వేరియంట్‌తో పాటు ప్లస్‌, ప్రో, ప్రో మ్యాక్స్‌ పేరుతో నాలుగు మోడళ్లను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరంగా ఈసారి ఏమేం మార్పులు చేస్తారో చూడాలంటే సెప్టెంబర్‌ వరకు వేచి చూడాల్సిందే.
  • శాంసంగ్‌ ఫోల్డ్‌ : శాంసంగ్‌ సంస్థ తన తదుపరి తరం ఫోల్డబుల్‌ ఫోన్లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. జులై 10న అన్‌ప్యాక్డ్‌ పేరిట ఈవెంట్ నిర్వహించి ఈ ఫోన్లను లాంచ్‌ చేయనుంది. ఈ ఈవెంట్‌లో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 6, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 6 ఫోన్లను లాంచ్‌ చేయనుంది. ఫోల్డబుల్‌ ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి శాంసంగ్‌ ఏం మ్యాజిక్‌ చేయబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజూలు ఆగాలి.
  • పిక్సెల్స్‌ రెడీ: తన తదుపరి పిక్సెల్‌ ఫోన్‌ పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో ఫోన్లను తీసుకొచ్చేందుకు గూగుల్‌ సిద్ధమవుతోంది. ఆగస్టు 13న ఈ ఫోన్లను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈసారి ఏఐ ఫీచర్లపై గూగుల్‌ ఫోకస్‌ చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన టీజర్‌ ద్వారా తెలుస్తోంది.
  • నథింగ్‌ 3: ట్రాన్సపరెంట్‌ డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన టెక్‌ ప్రియుల మనసులు గెలుచుకున్న నథింగ్‌ ఫోన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 1, 2 పేరిట రెండు ఫోన్లను లాంచ్‌ చేసింది. ఇప్పడు నథింగ్‌ ఫోన్‌ 3ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. స్నాప్‌డ్రాగన్‌ 8 సిరీస్‌ చిప్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇది కూడా రెండో అర్ధభాగంలోనే రాబోతోంది. ఎప్పుడనేది తెలియరాలేదు.
  • మోటో మడత ఫోన్‌: మోటో సైతం ఈ ఏడాది ఫ్లిప్‌, ఫోల్డబుల్‌ ఫోన్లను లాంచ్ చేయనుంది. రేజర్‌ 50, రేజర్‌ 50 అల్ట్రా పేరిట ఈ ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. జులైలో భారత్‌కు రానున్నాయి. వీటి ధరలు రూ.60-70వేలు ఉండొచ్చని అంచనా. చూడాలి ఎంత ధరలో తెస్తారో?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు