Unemployment rate: 8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు.. వెల్లడించిన సీఎంఐఈ

Unemployment rate: దేశంలో నిరుద్యోగం రేటు 8 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ విషయం సీఎంఐఈ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైంది.

Published : 04 Jul 2024 15:19 IST

Unemployment rate | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగింది. మేలో 7శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి చేరింది. ఇది 8 నెలల గరిష్ఠం అని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహసర్వేలో బహిర్గతమైంది. గతేడాది జూన్‌లో నమోదైన 8.5 శాతంతో పోలిస్తే అధికంగా ఉందని వెల్లడించింది. 

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఆధారంగా సీఎంఐఈ ఈ రేటును అందిస్తుంటుంది. సీఎంఐఈ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నిరుద్యోగుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. గతేడాది జూన్‌లో నిరుద్యోగంతో సతమతమవుతున్న మహిళలు 15.1శాతంగా ఉంటే ఈ ఏడాది జూన్‌ నాటికి 18.5 శాతానికి పెరిగిందని తెలిపింది. అదే సమయంలో పురుషులు 7.7 శాతం నుంచి 7.8 శాతానికి చేరారని వెల్లడించింది. 

టీమ్‌ఇండియా కోసం ఆ విమానం పంపారా?.. ఎయిరిండియాను ఆరాతీసిన డీజీసీఏ

గ్రామీణప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి. 2024 మేలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌ నాటికి 9.3 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగంలో కూరుకుపోయిన పురుషుల సంఖ్య మేలో 5.4శాతంగా ఉండగా.. జూన్‌ నాటికి 8.2 శాతానికి చేరింది. అదే కాలంలో మహిళల సంఖ్య 12.0 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ నిరుద్యోగం కాస్త తక్కువగానే నమోదైంది. మే లో 8.6 శాతంగా ఉన్న రేటు జూన్‌లో 8.9 శాతానికి పెరిగింది. కార్మిక భాగస్వామ్య రేటు (LPR) స్వల్పంగా మెరుగుపడింది. 2024మే లో 40.8 శాతం ఉండగా.. జూన్ నాటికి 41.4 శాతానికి పెరిగింది. గతేడాది జూన్‌లో 39.9 శాతంగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని