Unacademy Layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్‌అకాడమీ

Unacademy lays off: వ్యయ నియంత్రణలో భాగంగా ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది.

Published : 03 Jul 2024 15:30 IST

Unacademy lays off | ఇంటర్నెట్‌ డెస్క్‌: సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులున్న ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

2023 మార్చిలోనే అన్‌అకాడమీ తొలగింపులు చేపట్టింది. కంపెనీ ఆన్‌లైన్‌ వ్యాపార వృద్ధి క్షీణించిన కారణంగా మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం నుంచి 12 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఆ తర్వాత నష్టాలను తగ్గించుకోవడంతో పాటు నిధుల్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా గత రెండేళ్లలో దాదాపు 1,500 - 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. స్థిరమైన వృద్ధి, వ్యాపార సామర్థ్యం లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. 

ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే..

తమ కంపెనీలోని ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయాన్ని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. లేఆఫ్‌కు గురైన వారిలో మార్కెటింగ్‌, సేల్స్‌తో సహా వివిధ భాగాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఉన్నారు. తాజాగా అన్‌అకాడమీ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్‌ ముంజాల్‌ స్టార్టప్‌ సంస్థల వైఫల్యాల గురించి ప్రస్తావించారు. ఈ విషయం తెలిపిన మరుసటి రోజే సంస్థ నుంచి లేఆఫ్‌ ప్రకటన రావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2023 మార్చి నాటికి కంపెనీ ఆదాయం 26.15 శాతం వృద్ధి చెందింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు 41 శాతం మేర తగ్గి రూ.1,678 కోట్లకు చేరుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని