UltraTech - India Cements: ఇండియా సిమెంట్స్‌లో అల్ట్రాటెక్‌కు 23% వాటా.. ఒప్పంద విలువ ₹1,885 కోట్లు

UltraTech - India Cements: రూ.1,885 కోట్లతో ఇండియా సిమెంట్స్‌లో అల్ట్రాటెక్‌ సిమెంట్ 23 శాతం వాటా కొనుగోలు చేయనుంది.

Published : 27 Jun 2024 12:26 IST

UltraTech - India Cements | దిల్లీ: భారత సిమెంట్‌ తయారీ పరిశ్రమలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌లో (India Cements Ltd) 23 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (UltraTech Cement) గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.1,885 కోట్లని వెల్లడించింది. దాదాపు 7.06 కోట్ల ఈక్విటీ వాటాలను కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

2023-24 ఆర్థిక సంవత్సరం ఇండియా సిమెంట్స్‌ (India Cements Ltd) టర్నోవర్‌ రూ.5,112 కోట్లు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు 152.7 మిలియన్‌ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం ఉంది. 24 ఇంటిగ్రేటెడ్‌ తయారీ, 33 గ్రైండింగ్‌, ఒక క్లింకరైజేషన్‌, 8 బల్క్‌ ప్యాకేజింగ్‌ టెర్మినళ్లు ఉన్నాయి. తాజా పరిణామం నేపథ్యంలో ఇండియా సిమెంట్స్‌ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో గురువారం ఓ దశలో 14 శాతం పుంజుకొని రూ.298.80 దగ్గర 52 వారాల గరిష్ఠానికి చేరింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 6.51 శాతం పెరిగి రూ.11,875.95 దగ్గర ఏడాది గరిష్ఠాన్ని తాకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు