ట్రయంఫ్‌ స్పీడ్‌, స్క్రాంబ్లర్‌ మోటార్‌ సైకిళ్లపై డిస్కౌంట్‌

Triumph Motorcycles: ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌.. బైక్‌లపై ట్రయంఫ్‌ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది.

Published : 05 Jul 2024 13:31 IST

Triumph Motorcycles | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మోటార్‌ సైకిల్‌ కంపెనీ ట్రయంఫ్‌ (Triumph) దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj auto)తో కలసి తీసుకొచ్చిన రెండు బైక్‌లపై ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. కంపెనీ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మొదటిసారి రాయితీలు అందిస్తోంది. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 (Triumph Speed 400), స్క్రాంబ్లర్‌ 400X (Scrambler 400X) పేరిట లాంచ్‌ చేసిన బైక్‌లపై రూ.10,000 తగ్గింపును ఇస్తోంది. 

ఈ రెండు మోటార్‌సైకిళ్లను 50 దేశాల్లో 50,000 యూనిట్లకు పైగా విక్రయించింది. ట్రయంఫ్‌ ప్రకటించిన ఆఫర్‌ జులై చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 ప్రస్తుత ధర రూ.2.34 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) ఉండగా.. ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400X ప్రస్తుత ధర రూ.2.64 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. ఆఫర్‌ సమయంలో కొనుగోలు చేస్తే ఈ రెండు బైక్‌లపై డిస్కౌంట్‌ పొందొచ్చు.

‘అదానీ’పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్‌ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!

ఇక వీటి స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఈ రెండు మోటార్‌ సైకిళ్లు 398 సీసీ ఇంజిన్‌తో వస్తున్నాయి. లిక్విడ్‌ కూల్డ్‌, డ్యూయల్‌ ఓవర్‌ హెడ్‌ క్యామ్‌షాఫ్ట్‌ సింగిల్‌ సిలిండర్‌తో వస్తున్న ఈ ఇంజిన్‌.. 40 పీఎస్‌ పవర్‌ను, 39.5 నానోమీటర్‌ పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. లీటర్‌కు 28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ వంటివి ఉన్నాయి. గతేడాది భారత్‌లో కేవలం 15 డీలర్‌షిప్‌లకే పరిమితమైన ట్రయంఫ్‌.. బజాజ్‌ ఆటో భాగస్వామ్యంతో వాటిని 90కు పెంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని