Star Health Insurance: ఇంటి వద్దా ఆరోగ్య సేవలు: స్టార్‌ హెల్త్‌

ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలను, తమ పాలసీదార్లకు అందించడాన్ని బీమా కంపెనీ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బుధవారం ప్రారంభించింది.

Published : 04 Jul 2024 02:47 IST

చెన్నై: ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలను, తమ పాలసీదార్లకు అందించడాన్ని బీమా కంపెనీ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బుధవారం ప్రారంభించింది. 50 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించామని, త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ ఆనంద్‌ రాయ్‌ పేర్కొన్నారు. ఇందుకోసం కేర్‌24, పోర్టీ, కాల్‌హెల్త్, అతుల్య హోమ్‌కేర్, ఆర్గాలా వంటి సంస్థలతో స్టార్‌ హెల్త్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కోయంబత్తూర్, పుణె, దిల్లీ, కోల్‌కతా నగరాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ చేపట్టాకే, ఇతర నగరాలకు విస్తరించాలని నిర్ణయించామని ఆనంద్‌ రాయ్‌ తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 04469006900  లేదా స్టార్‌ హెల్త్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా, పలు వ్యాధులకు ఈ పద్ధతిలో వినియోగదారులు చికిత్స పొందొచ్చని వివరించారు. తక్కువ సమయంలోనే ఇంటివద్ద వైద్య సేవలు పొందొచ్చన్నారు. 5 రోజుల చికిత్సకు డాక్టర్, నర్సింగ్‌ ఛార్జీలతో కలిపి రూ.7000-7500 అవుతుందని వివరించారు. ఈ మొత్తాన్ని బీమా మొత్తం నుంచి మినహాయించుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని