Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్‌షిప్‌ ఇయర్‌బడ్స్‌.. 5జీ స్మార్ట్‌ఫోన్‌ కంటే ఎక్కువే!

Sony TWS earbuds launched: సోనీ సంస్థ కొత్త టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్‌ 18 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Updated : 27 Sep 2023 18:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ (Sony) కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రీమియం ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను (TWS earbuds) భారత మార్కెట్‌కు తీసుకొచ్చింది. ప్రీమియం సౌండ్‌ క్వాలిటీ, నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో కూడిన ఇయర్‌ బడ్స్‌ను WF-1000XM5 పేరిట బుధవారం వీటిని లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.24,990గా కంపెనీ పేర్కొంది. ప్రీ ఆర్డర్లు నేటి నుంచి (సెప్టెంబర్‌ 27) ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ప్రీ ఆర్డర్‌ చేసుకున్న వారికి రూ.3 వేలు క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ.4,990 విలువైన SRS-XB100 పోర్టబుల్‌ వైర్‌లెస్‌ స్పీకర్‌ను సోనీ ఉచితంగా ఇస్తోంది.

యూపీఐ ఎఫెక్ట్‌.. రూపే కార్డులకు భలే డిమాండ్‌..!

సోనీ కొత్త ఇయర్‌బడ్స్‌ ఫీచర్ల విషయానికొస్తే.. విండ్‌ నాయిస్‌ను క్యాన్సిల్‌ చేయడానికి వీ2 ప్రాసెసర్‌, QN2e హెచ్‌డీ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ ప్రాసెసర్‌ను వినియోగించారు. అలాగే డీప్‌ నెట్‌వర్క్‌ బేస్డ్‌ ఏఐ అల్గారిథమ్‌ను వినియోగించారు. లో ఫ్రీక్వెన్సీ క్యాన్సిలేషన్‌ కోసం ఒక్కో ఇయర్‌బడ్‌కు మూడేసి మైక్రోఫోన్లు ఇచ్చారు. ఇందులో అడాప్టివ్‌ సౌండ్‌ కంట్రోల్‌,  స్పీక్‌ టు చాట్‌, ఐపీఎక్స్‌ 4 రేటెడ్‌ స్వెట్‌ రెసిస్టెన్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ 8 గంటల మ్యూజిక్‌ ప్లే బ్యాక్‌, 24 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తాయి. కేవలం మూడు నిమిషాల ఛార్జింగ్‌తో గంట మ్యూజిక్‌ ప్లే బ్యాక్‌ ఆనందించొచ్చని కంపెనీ పేర్కొంది. బ్లాక్‌, ప్లాటినమ్‌ సిల్వర్‌ రంగుల్లో ఈ ఇయర్‌బడ్స్‌ లభిస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని