Sony Bravia 7 series: సోనీలో కొత్త బ్రేవియా 7 సిరీస్‌ టీవీలు.. ధర, ఫీచర్లివే..!

Sony Bravia 7 series : బ్రేవియా 7 సిరీస్‌లో సోనీ మినీ ఎల్‌ఈడీ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మెరుగైన ఆడియో, వీడియో ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా వీటిని తీర్చిదిద్దింది.

Published : 03 Jul 2024 16:27 IST

Sony Bravia 7 series | ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనీ ఇండియా బ్రేవియా 7 సిరీస్‌లో (Sony Bravia 7 series) కొత్త టీవీలను విడుదల చేసింది. కాగ్నిటివ్‌ ప్రాసెసర్‌ ఎక్స్‌ఆర్‌, మినీ ఎల్‌ఈడీ, ఎక్స్‌ఆర్‌ ట్రిల్యుమినోస్‌ ప్రో టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లతో విజువల్‌, ఆడియో పరంగా ఈ టీవీలను ఉన్నతంగా తీర్చిదిద్దింది.

సోనీ బ్రేవియా 7 సిరీస్‌ ఫీచర్లు..

సోనీ బ్రేవియా 7 సిరీస్‌ (Sony Bravia 7 series) టీవీలు 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల పరిమాణంలో లభిస్తున్నాయి. ఎక్స్‌ఆర్‌ కాంట్రాస్ట్‌ బూస్టర్‌, మినీ ఎల్‌ఈడీ ప్యానెల్‌తో ఇమేజ్‌ క్వాలిటీ పెరగనుంది. ఎక్స్‌ఆర్‌ ట్రిల్యుమినోస్‌ ప్రో టెక్నాలజీతో అనేక రంగులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతి ఫొటో, వీడియో అత్యంత సహజంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్‌ఆర్‌ క్లియర్‌ ఇమేజ్‌ టెక్‌ వల్ల యాక్షన్‌ సినిమాల్లో వేగంగా కదిలే సీన్స్‌ సైతం అత్యంత స్పష్టంగా కనిపిస్తాయని వివరించింది.

అకౌస్టిక్‌ మల్టీ-ఆడియో టెక్నాలజీ, ఎక్స్‌ఆర్ సౌండ్‌ పొజిషనింగ్‌తో సోనీ బ్రేవియా 7 సిరీస్‌ టీవీల సౌండ్‌ క్వాలిటీ అత్యంత నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 3డీ సరౌండ్‌ సౌండ్‌తో గొప్ప అనుభూతి లభిస్తుందని పేర్కొంది. డాల్బీ విజన్‌, డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీలతో హెచ్‌డీఆర్‌ కంటెంట్‌, మల్టీ డైమెన్షనల్‌ సౌండ్‌ వస్తాయని తెలిపింది.

గేమ్స్‌ ఆడేవాళ్లకు అనుగుణంగా బ్రేవియా 7 సిరీస్‌ను (Sony Bravia 7 series) ప్లేస్టేషన్‌ 5కు అనుసంధానించి ఆటో హెచ్‌డీఆర్‌ టోన్‌ మ్యాపింగ్‌, ఆటో లో ల్యాటెన్సీ మోడ్‌ వంటి ఫీచర్లను ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. గూగుల్‌ టీవీ కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో నాలుగు లక్షల సినిమాలు, టీవీ ఎపిసోడ్లు, 10వేల యాప్‌లు, గేమ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. బ్రేవియా క్యామ్‌ యాక్సెసరీని విడిగా కొనుగోలు చేస్తే సైగలతోనే టీవీని నియంత్రించొచ్చని.. గూగుల్ మీట్‌ ద్వారా వీడియో కాల్‌ కూడా లభిస్తుందని తెలిపింది. 

బ్రేవియా 7 సిరీస్‌ ధర..

  • 55 అంగుళాల టీవీ - రూ.1,82,990
  • 65 అంగుళాల టీవీ - రూ.2,29,990
  • 75 అంగుళాల టీవీ - ఇంకా వెల్లడించాల్సి ఉంది.

సోనీ రిటైల్‌ ఔట్‌లెట్లు, ప్రధాన ఎలక్ట్రానిక్‌ స్టోర్లు, ఈ-కామర్స్‌ పోర్టళ్లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు