Digitization: చిన్న కంపెనీలూ డిజిటైజేషన్‌ బాటలో

వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్‌ఎమ్‌ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్‌ చేయనున్నాయని వొడాఫోన్‌ ఐడియా బిజినెస్‌ తన నివేదికలో పేర్కొంది.

Updated : 29 Jun 2024 07:08 IST

2025 కల్లా 60% ఎంఎస్‌ఎమ్‌ఈలు ఆ పనిచేస్తాయ్‌
వొడాఫోన్‌ ఐడియా నివేదిక 

దిల్లీ: వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్‌ఎమ్‌ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్‌ చేయనున్నాయని వొడాఫోన్‌ ఐడియా బిజినెస్‌ తన నివేదికలో పేర్కొంది. అంతే కాదు ఇందు కోసం బడ్జెట్‌ను పెంచుకోవాలని 43 శాతం కంపెనీలు భావిస్తున్నాయనీ తెలిపింది. 16 పరిశ్రమల్లో 1.6 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి రూపొందించిన ఈ నివేదిక ఇంకా ఏమంటోందంటే..

  • ఎంఎస్‌ఎమ్‌ఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివి. 6.3 కోట్లకు పైగా ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు 11 కోట్ల మందికి పైగా ఉపాధినిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీకి ఇవి 30 శాతం వాటాను అందిస్తున్నాయి. 2027 కల్లా ఈ వాటా 35-40 శాతానికి పెరగొచ్చని అంచనా. 
  • 2047 కల్లా ‘వికసిత్‌ భారత్‌’(అభివృద్ధి చెందిన భారత్‌) ఏర్పడడంలో కీలక పాత్ర పోషించాలన్నా, తమ వృద్ధి అవకాశాలను మరింత పెంచుకోవాలంటే ఎంఎస్‌ఎమ్‌ఈలు డిజిటల్‌లోకి తప్పక మారాల్సిన అవసరం ఉంది. 
  • 2024-25 కల్లా తమ వ్యాపారాన్ని డిజిటైజ్‌ చేయడానికి 59 శాతం ఎంఎస్‌ఎమ్‌ఈలు మొగ్గుచూపుతున్నాయి. పనిప్రదేశంలో వాతావరణాన్ని మెరుగుపరచాలని 29% కంపెనీలు, వినియోగదార్లతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలని 12% సంస్థలు భావిస్తున్నాయి. 
  • 2025 కల్లా తమ మొత్తం డిజిటలైజేషన్‌ బడ్జెట్‌ను పెంచుకోవాలని 43% ఎంఎస్‌ఎమ్‌ఈలు భావిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ మెచూరిటీ ఇండెక్స్‌(డీఎమ్‌ఐ) తక్కువగా ఉన్న రంగాలు ఇందుకు పెట్టుబడులు పెంచుకోవాలని అనుకుంటున్నాయి. ప్రస్తుతం ఐటీ-ఐటీఈఎస్, ఆర్థిక, రవాణా.. అగ్రగామి డీఎమ్‌ఐ రంగాలుగా ఉన్నాయి.
  • డిజిటలైజేషన్‌ పెరిగితే టర్నోవరు పెరుగుతుంది. అలాగే కంపెనీ పరిమాణం పెరిగేకొద్దీ డీఎమ్‌ఎల్‌ తగే అవకాశం ఉంది. అందు వల్ల మధ్య నుంచి పెద్ద కంపెనీలు డిజిటైజేషన్‌పై ఎక్కువ మొగ్గుచూపుతున్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని