Stock market: సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్‌ 80 వేలు తాకి వెనక్కి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 545 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 03 Jul 2024 16:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 80వేల మార్కును అందుకుంది. ఇంట్రాడేలో 80,074 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకి కాస్త క్షీణించి 80వేల మార్కు దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 24,307 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు ప్రధానంగా కలిసొచ్చింది.

సెన్సెక్స్‌ ఉదయం ఆరంభంలోనే 80,013.77 పాయింట్ల ఎగువన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవలే 75 వేల మార్కును అందుకున్న సెన్సెక్స్ కేవలం 57 రోజుల్లోనే 80 వేల మార్కును చేరుకోవడం గమనార్హం. ఇంట్రాడేలో 79,754.95 - 80,074.30 మధ్య చలించిన సూచీ.. చివరికి 545.35 పాయింట్ల లాభంతో 79,986.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162.65 పాయింట్లు లాభపడి 24,286.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.52గా ఉంది.

జియో vs ఎయిర్‌టెల్‌ vs వొడాఫోన్‌ ఐడియా.. పాపులర్‌ ప్లాన్ల కొత్త ధరలు ఇవే..

సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు్ ప్రధానంగా లాభపడ్డాయి. టీసీఎస్‌, టైటాన్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ ధర 86.30 డాలర్లు, ఔన్సు బంగారం 2356 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు