Stock market: రెండో రోజూ అదే దూకుడు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 620, నిఫ్టీ 147 పాయింట్ల మేర లాభాల్లో ముగిశాయి.

Updated : 26 Jun 2024 18:27 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి రాణించాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సూచీలు మరోసారి జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78759.4 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,889.90 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను నమోదు చేశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 78,094.02 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. చివరికి 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.50 పాయింట్ల లాభంతో 23,868.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.58గా ఉంది. సెన్సెక్స్‌లో రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 85.72 డాలర్ల వద్ద, ఔన్సు బంగారం 2326 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • జునిపర్‌ గ్రీన్‌ ఎనర్జీ విద్యుత్‌ ఒప్పందాలు: గుజరాత్‌, రాజస్థాన్‌లలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి రెండు వేర్వేరు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేసినట్లు జునిపర్‌ గ్రీన్‌ ఎనర్జీ బుధవారం తెలిపింది. గుజరాత్‌లో 90 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్ట్‌ కోసం విండ్‌ ఫేజ్‌ VI కింద గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (GUVNL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఏడాదికి దాదాపు 29.30 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. అలాగే, గుజరాత్‌, రాజస్థాన్‌లలో 150 మెగావాట్ల విండ్‌-సోలార్‌ హైబ్రిడ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం హైబ్రిడ్‌ ట్రాంచ్‌ VII కింద సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(SECI)తో కంపెనీ మరో PPA (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌)పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఏడాదికి దాదాపు 47.70 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని