SEBI: బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!

స్టాక్‌ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది.

Published : 05 Jul 2024 03:49 IST

సెబీ ఆదేశాలు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది.

  • ట్రేడింగ్‌ కార్యకలాపాలు, అంతర్గత నియంత్రణలు, ప్రజా వేగు విధాన (విజిల్‌ బ్లోయర్‌ పాలసీ) ఆవిష్కరణ తదితరాలకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ సూచించింది. 
  • సెబీతో ముందుగా చర్చలు జరిపి, అనంతరం ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ ఫోరమ్‌ (ఐఎస్‌ఎఫ్‌) రూపొందించిన కార్యకలాపాల విధానాలతో పాటు పై వ్యవస్థల అమలుకు బ్రోకరేజీలు ప్రమాణాలను సైతం నిర్దేశించుకోవాలని సూచించింది.

ఎపుడు అమలు చేయాలంటే..

  • స్టాక్‌ బ్రోకర్ల స్థాయిని బట్టి ఈ ఆదేశాల అమలు తేదీ ఉంటుంది. 50,000 యాక్టివ్‌ యూనిక్‌ క్లయింట్‌ కోడ్స్‌ (యూసీసీలు)కు మించి ఉన్న బ్రోకర్లు 2025 జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమలు చేయాలి.
  • 2001 నుంచి 50,000 వరకు యాక్టివ్‌ యూసీసీలున్న బ్రోకర్లు 2025 ఏప్రిల్‌ 1 నుంచి; 2000 వరకు యాక్టివ్‌ యూసీసీలున్న బ్రోకర్లు 2026 ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా వీటిని అమలు చేయాలి.
  • క్వాలిఫైడ్‌ స్టాక్‌ బ్రోకర్లు ఈ నిబంధనలను 2024 ఆగస్టు 1 లోగానే పాటించాలి. 

ఈ సర్క్యులర్‌లోని నిబంధలను బ్రోకర్ల దృష్టికి తీసుకెళ్లాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెబీ ఆదేశాలిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని