SBI Home Loans: గృహ రుణ వడ్డీ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

ఎస్‌బీఐ డిసెంబరు 15 నుంచి గృహ రుణ వడ్డీ రేట్లను పెంచింది.

Updated : 15 Dec 2022 18:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ రేట్లను పెంచింది. సవరించిన MCLR, EBLR, RLLRను డిసెంబరు 15 నుంచి అమల్లోకి  తీసుకొచ్చింది. దీని ప్రకారం.. 800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు కలిగిన రుణగ్రహీతలకు సాధారణ గృహ రుణాల కనీస వడ్డీ రేటు 8.90 శాతంతో లభిస్తాయి. ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు (6.25 శాతానికి) పెంచిన తర్వాత ఎస్‌బీఐ తన గృహ రుణ, ఎఫ్‌డీ రేట్లను పెంచింది. ఒక సంవత్సరానికి MCLR 8.05% నుంచి 8.30%కు పెంచింది. వాహన, గృహ, వ్యక్తిగత రుణాలతో సహా వినియోగదారుల రుణాలలో ఎక్కువ భాగం MCLRతో ముడిపడి ఉన్నాయి.

ఎస్‌బీఐ గృహరుణ వడ్డీ రేట్లు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం..800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న రుణగ్రహీతలకు సాధారణ గృహ రుణాలు 8.90 శాతం కనీస వడ్డీ రేటుతో వస్తాయి. క్రెడిట్‌ స్కోరు 750 నుంచి 799 వరకు ఉన్నవారికి 9%, 700-750 సిబిల్‌ స్కోరు ఉంటే 9.10%, 650-699 మధ్య స్కోరు ఉంటే 9.20% వడ్డీ రేటు ఉంటుంది. మహిళా రుణ గ్రహీతలు 0.05% తగ్గింపు పొందుతారు.

800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి సైతం వడ్డీ రేటు, ఈఎంఐ ఎంత పెరుగుతుందో ఈ కింది పట్టికలో ఉంది.

గమనిక: వడ్డీ రేట్లు సవరించాక పై పట్టికలో తెలిపిన రుణ మొత్తానికి ఈఎంఐ ఏడాదికి సుమారుగా రూ.9,400 పెరుగుతుంది. అంటే, 20 సంవత్సరాలకుగాను సుమారుగా రూ.1,88,000 వరకు పెరుగుతుంది. అయితే కాలానుగుణంగా వడ్డీ రేట్లలో వచ్చే మార్పులను బట్టి ఈఎంఐలలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఇంకా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు