Credit card rules: క్రెడిట్‌ కార్డు రూల్స్‌లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్‌ ఉందా?

Credit card rules: క్రెడిట్‌ కార్డులకు సంబంధించి బ్యాంకులు కొన్ని మార్పులు చేశాయి. జులై నుంచే ఆ మార్పులు అమల్లోకి రానున్నాయి.

Published : 29 Jun 2024 15:35 IST

Credit card rules | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డు (Credit card) నిబంధనల్లో కొన్ని మార్పులు చేశాయి. రివార్డు పాయింట్లు, వాటి ప్రయోజనాల్లో సవరణలు చేశాయి. జులై నెలలోనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఇంతకీ ఆ మార్పులేంటో చూసేయండి.

  • ఎస్‌బీఐ: క్రెడిట్‌ కార్డు రివార్డులకు సంబంధించి ఎస్‌బీఐ కార్డ్స్‌ కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేస్తోంది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల కార్డులపై మాత్రం జులై 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌: క్రెడిట్‌ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను రూ.100 నుంచి రూ.200కు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఎమరాల్డ్‌ కార్డు మినహా) పెంచింది. అదే సమయంలో చెక్‌/ క్యాష్‌ పికప్‌ ఫీజు, స్లిప్‌ రిక్వెస్ట్‌, డయల్‌ ఏ డ్రాఫ్ట్‌ లావాదేవీ ఛార్జీ, ఔట్‌ స్టేషన్‌ చెక్‌ ప్రాసెసింగ్‌ ఫీజు, డూప్లికేట్ స్టేట్‌మెంట్‌ రిక్వెస్ట్‌ వంటి వాటిపై ఛార్జీలను తొలగించింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: క్రెడ్‌, పేటీఎం, చెక్‌, మొబిక్విక్‌ వంటి థర్డ్‌ పార్టీ పేమెంట్‌ యాప్స్‌ నుంచి చేసే రెంట్‌ పేమెంట్స్‌పై ఇకపై ఛార్జీలు వసూలుచేయాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్ణయించింది. రెంట్‌ పేమెంట్‌పై 1 శాతం చొప్పున ఛార్జీ వసూలు చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
  • సిటీ బ్యాంక్‌: సిటీ బ్యాంక్‌ కార్యకలాపాలను యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బ్యాంక్‌కు సంబంధించి క్రెడిట్‌ కార్డు అకౌంట్స్‌ జులై 15 నాటికి యాక్సిస్‌ బ్యాంక్‌లో పూర్తిగా విలీనం అవుతాయి. కొత్త యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులు జారీ అయ్యేవరకు సిటీ బ్రాండ్‌ కార్డులు పనిచేస్తాయని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. అలాగే, విలీనం వరకు ఉన్న పాయింట్లు ఎప్పటికీ ఎక్స్‌పైర్‌ కావని, మైగ్రేషన్‌ తర్వాత మాత్రం మూడేళ్లకే రివార్డు పాయింట్లు ఎక్స్‌పైర్‌ అవుతాయని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని