Rich Dad Poor Dad: రిచ్‌ డాడ్‌ పూర్‌డాడ్‌ రచయితకు 1.2 బిలియన్‌ డాలర్ల అప్పు!

Robert Kiyosaki: రిచ్‌ డాడ్‌, పూర్‌డాడ్‌ రచయిత రాబర్ట్‌ కియోసాకి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆస్తులు, అప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలిపారు.

Published : 05 Jan 2024 01:39 IST

Rich Dad Poor Dad author | ఇంటర్నెట్‌డెస్క్‌: రాబర్ట్‌ కియోసాకి రచించిన ‘రిచ్‌ డాడ్‌.. పూర్‌ డాడ్‌’ పుస్తకం చాలా మందికి సుపరిచితమే. ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా ఆర్థికాంశాల ప్రాముఖ్యత తెలపడంతో ఈ పుస్తకం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల జాబితాలోనూ చోటు దక్కించుకుంది. అయితే ఈ అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడు ప్రస్తుతం అప్పుల్లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఇన్‌స్ట్రాలో ఇటీవల కియోసాకి ఓ రీల్‌ పోస్ట్‌ చేశారు. అందులో రుణాలు, ఆస్తుల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. ‘చాలా మంది రుణాల్ని తీసుకొని విలాస వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అది అప్పు. నేను మాత్రం రుణాల్ని తీసుకొని ఆస్తుల్ని కొంటాను. ఫెరారీ, రోల్స్‌ రాయల్స్‌ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు మాత్రమే. అవి ఆస్తులు కావు’’ అని కియోసాకి అన్నారు. తన సంపాదనను డబ్బు రూపంలో తానెప్పుడు ఆదా చేయను అని కియోసాకి తెలిపారు. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తానని చెప్పారు. ఇలా తన పెట్టుబడుల్లో భాగంగా తాను చేసిన అప్పు 1.2 బిలియన్‌ డాలర్లకు చేరిందని చెప్పారు. తన అప్పే తన ఆస్తి అని చెప్పారు.

విద్యుత్‌ వాహనాలకు సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ!

రుణాలను కూడా.. గుడ్‌, బ్యాడ్‌ గా కియోసాకి విభజించారు. మంచి రుణం సంపదను సృష్టిస్తుందన్నారు. రుణాల్ని తీసుకొని రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం, వ్యాపారం చేయటం వంటివన్నీ మంచి రుణాల కిందకు వస్తాయన్నారు. మార్కెట్‌ ఒడుదొడుకులను ఎదుర్కోవడానికి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని చెప్పారు. డబ్బు రూపంలో పెట్టుబడి పెట్టడం కంటే వెండి, బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. 1997లో విడుదలైన ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ పుస్తకం 40 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని