Mutual Funds: నిఫ్టీ-50 ఇండెక్స్‌ ఫండ్ల రాబడులు ఇవే..

నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్లు భారత మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లో ప్రముఖమైనవి. వీటి పనితీరు, రాబడులు ఇక్కడ తెలుసుకుందాం.

Published : 02 Jul 2024 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టాక్స్‌ మార్కెట్‌ అంటే రిస్క్‌ అనుకునేవారు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్‌ ఫండ్లలో అన్ని రకాల పథకాలు సురక్షితమైనవి కావు. ఇందులో ఫండ్‌ కేటగిరీని బట్టి రిస్క్‌ ఉంటుంది. కానీ, ఇండెక్స్‌ ఫండ్లు అధిక కాలం పాటు చాలా యాక్టివ్‌ ఫండ్ల కంటే మెరుగైన రాబడిని అందించిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. దీనిని బట్టి నిఫ్టీ- 50 ఇండెక్స్‌ ఫండ్లలో రిస్క్‌ తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. మదుపుదారులు ఇండెక్స్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు.. ఆ ఇండెక్స్‌ ఫండ్‌కు సంబంధించిన ఫండ్‌ మేనేజర్‌.. ట్రాక్‌ చేస్తున్న ఇండెక్స్‌కు సమానమైన నిష్పత్తిలో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారు. ఉదాహరణకు నిఫ్టీ 50లో రిలయన్స్‌ 10.3% వాటాను కలిగి ఉంటే, నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌కు సంబంధించిన ఫండ్‌ మేనేజర్‌ రిలయన్స్‌ కంపెనీ స్టాక్స్‌ వెయిటేజీ 10.3% ఉన్న పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. అదేవిధంగా, ఇతర కంపెనీల స్టాక్స్‌ ఇండెక్స్‌తో సమాన నిష్పత్తిలో ఉంటాయి. ఇండెక్స్‌లో స్టాక్‌ వెయిటేజీ పెరిగినా లేదా తగ్గినా.. ఫండ్‌ మేనేజర్‌ కూడా తన ఫండ్‌లో ఆ మార్పులను సరి చేస్తారు. ఇండెక్స్‌ ఫండ్‌ నిర్వహణ ఖర్చు ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణ ఖర్చు కంటే చాలా తక్కువగా ఉంటుంది.

3, 5, 10 సంవత్సరాలలో 12% కంటే ఎక్కువ రాబడిని అందించే ఫండ్ల జాబితాను కింది పట్టికలో తెలిపాం. 2024 జులై 1 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి..

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయని హామి లేదు. కాబట్టి, ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిస్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు