Reliance: ₹21 లక్షల కోట్లకు రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌.. తొలి భారతీయ కంపెనీగా చరిత్ర

Reliance Industries: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ పరంగా అరుదైన మొలురాయిని చేరుకుంది.

Published : 28 Jun 2024 14:02 IST

Reliance Industries | దిల్లీ: ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance industries) మరోసారి అరుదైన ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా రూ.21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. శుక్రవారం మార్కెట్‌ ప్రారంభంలోనే కంపెనీ షేరు సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. ఒకానొక సమయంలో కంపెనీ షేరు విలువ 1.69శాతం ఎగబాకి రూ.3,129కి చేరుకోవడంతో మార్కెట్‌ విలువ పెరిగింది. దీంతో రిలయన్స్‌ ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టాక్‌ విలువ ఇప్పటివరకు 20శాతానికి పైగా పెరిగింది.

జియో బాటలోనే ఎయిర్‌టెల్‌.. టారిఫ్‌ల పెంపు

తన టారిఫ్‌లను పెంచనున్నట్లు టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో గురువారం ప్రకటించింది. ఒక్కో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచింది.  కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. కొత్త టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ప్రకటనతో షేర్లు పుంజుకున్నాయి. అదే సమయంలో బ్రోకరేజ్‌ సంస్థలు కూడా సానుకూల రేటింగ్‌లు ఇవ్వడం రిలయన్స్‌కు కలిసొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని