Jio New Tariffs: రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?

జియో తమ టారిఫ్‌ల ఒక్కో ప్లాన్‌ మీద 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో ప్రకటించింది.

Updated : 27 Jun 2024 19:59 IST

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తమ టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. కొత్త టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుంది.  ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి.

కొత్త టారిఫ్‌ ధరలు ఇవీ...

రెండు కొత్త సర్వీసులు..

  • జియో సేఫ్‌ - క్వాంటం సెక్యూర్‌ (Jio Safe): ఇది కాలింగ్‌, మెసేజింగ్‌, ఫైల్‌ బదిలీతో పాటు కమ్యూనికేషన్‌ సదుపాయాలు అందించే యాప్‌. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులు పొందొచ్చు. 
  • జియో ట్రాన్స్‌లేట్‌ - ఏఐ (JioTranslate): ఈ యాప్‌ వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 కట్టి ఈ యాప్‌ సేవలు పొందొచ్చు. అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో పేర్కొంది. 

85% జియోతోనే... 

దేశంలో 2జీ నెట్‌వర్క్‌కు పరిమితమైన జియో వినియోగదారులు 250 మిలియన్ల మంది ఉన్నారని.. వారు డిజిటల్‌ సేవల్ని వినియోగించుకోలేక పోతున్నారని జియో టెలికాం పేర్కొంది. వీరిని కొత్త తరం డిజిటల్‌ వైపుగా తీసుకొచ్చేందుకు 4జీ సదుపాయంతో జియో భారత్‌, జియో ఫోన్‌లను తీసుకొచ్చినట్లు తెలిపింది. ‘‘ట్రూ 5జీ ఇప్పుడు అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌. దేశంలో సొంతంగా 5జీ నెట్‌వర్క్‌ అందిస్తున్న టెలికాం సంస్థా మాదే. ప్రస్తుతం భారత్‌లో ఉన్న 5జీ మొబైల్స్‌లో సుమారు 85 శాతం జియోతో పని చేస్తున్నవే’’ అని సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని