Realme GT 6: 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో రియల్‌మీ కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే

Realme GT 6: రియల్‌మీ తన GT సిరీస్‌లో మరో కొత్త మొబైల్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. మూడు వేరియంట్లు, రెండు రంగుల్లో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Published : 20 Jun 2024 17:21 IST

Realme GT 6 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన GT సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రియల్‌మీ జీటీ6 (Realme GT 6) పేరిట దీన్ని తీసుకొచ్చింది. అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఉన్న ఈ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇతర ఫీచర్లు, ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

రియల్‌మీ కొత్త ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.42,999గా, 16జీబీ+ 512జీబీ వేరియంట్‌ ధర రూ.44,999గా పేర్కొంది. ఫ్లూయిడ్ స్లివర్, రేజర్ గ్రీన్ రంగుల్లో లభిస్తాయి. ప్రీ బుకింగ్‌ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్‌ బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ముందుగా బుక్‌ చేసుకున్న యూజర్లకు ఆరు నెలల పాటు స్క్రీన్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌, ఎంపిక చేసిన కార్డుపై రూ.4వేలు ఇన్‌స్టంట్‌ డిస్కెంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. 10నెలల పాటు నో- కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం అందిచనుంది.

జపాన్‌లో ఓ తోటమాలి విలువైన పాఠం నేర్పాడు: ఎన్విడియా సీఈవో

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇందులో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 8టీ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5తో పనిచేస్తుంది. వెనకవైపు 50 ఎంపీ సోనీ LYT808 సెన్సర్‌, 50 ఎంపీ శాంసంగ్‌ జేఎన్‌5 టెలిఫొటో సెన్సర్‌, 8 ఎంపీ సోనీ IMX355 అల్ట్రా వైడ్‌ సెన్సర్‌ ఇచ్చారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా అమర్చారు. వెనకవైపు నార్జో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 సెన్సర్‌ను అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, వై-ఫై6 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 5,500mAh బ్యాటరీ ఉంది. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని