Realme C63: లెదర్‌ ఫినిష్‌తో రియల్‌మీ నుంచి ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌

Realme C63: రియల్‌మీ సంస్థ సీ63 పేరిట కొత్త ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించింది.

Published : 01 Jul 2024 20:49 IST

Realme C63 | ఇంటర్నెట్ డెస్క్‌: మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) ఎంట్రీ లెవల్‌ యూజర్ల కోసం సీ63 (Realme C63) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. యాపిల్‌ ఐఫోన్‌ తరహా కెమెరా బంప్‌, వీగన్‌ లెదర్‌ డిజైన్‌తో దీన్ని విడుదల చేసింది. ఎయిర్‌గెశ్చర్స్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌టచ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నార్జో బ్రాండ్‌పై తీసుకొచ్చిన నార్జో 63ని ఈ ఫోన్‌ పోలి ఉంది.

రియల్‌మీ సీ63 4జీబీ+128జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ధరను రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ జులై 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌, ఇతర రిటైల్‌స్టోర్లలో లభించనుంది. గ్రీన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ ధరలో వీగన్‌ లెదర్‌ ఫినిష్‌తో ఇస్తుండడం గమనార్హం. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. యూనిసోక్‌ టీ612 ప్రాసెసర్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5తో  పనిచేస్తుంది. ఐపీ54 రేటింగ్‌తో వస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 1 నిమిషం పాటు ఛార్జింగ్‌ చేసి 1 గంట పాటు కాల్‌ మాట్లాడొచ్చని కంపెనీ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని