Realme C61: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ

Realme C61: రియల్‌మీ సీ61 మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో వస్తోన్న ఈ ఫోన్‌లో 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

Updated : 28 Jun 2024 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ధరలో రియల్‌మీ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. సీ61 (Realme C61) పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లు, రెండు రంగుల్లో లభిస్తోంది. ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

రియల్‌మీ సీ61లో (Realme C61) 90Hz రీఫ్రెష్‌ రేటు, 450 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.78 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. యూనిసాక్‌ టీ612 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. వెనక డెప్త్‌ సెన్సర్‌తో కూడిన 32MP కెమెరా, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP కెమెరాను ఇచ్చారు. వైఫై 2.4GHz / 5GHz, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 4జీ వరకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుండడం గమనార్హం.

ఈ ఫోన్‌ (Realme C61) సఫారీ గ్రీన్‌, మార్బుల్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. రియల్‌మీ సైట్‌లోని వివరాల ప్రకారం.. 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అమ్మకం ధర రూ.8,999. 4 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.8,499. 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.7,699.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు