Hero MotoCorp: హీరో కరిజ్మా XMR ఇక ప్రియం

హీరో మోటోకార్ప్‌కు చెందిన  కరిజ్మా XMR ప్రస్తుత ధర ఈ నెలాఖరు వరకే అమల్లో ఉంటుంది. అక్టోబర్‌ 1 నుంచి ధర మారుతుంది.

Published : 25 Sep 2023 20:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ తన కరిజ్మా XMR ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరను రూ.1,79,900 (ఎక్స్‌-షోరూం, ఢిల్లీ)గా ప్రకటించింది. 2023 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. సెప్టెంబరు 30 వరకు కరిజ్మా XMR రూ.1,72,900కే అందుబాటులో ఉంటుంది. సవరించిన ధరతో కొత్త బుకింగ్‌ తేదీని తర్వాత ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. కరిజ్మా XMRను 2023, ఆగస్టు 29న హీరో మోటోకార్ప్‌ ఆవిష్కరించింది. ఇది ఐకానిక్‌ యెల్లో, టర్బో రెడ్‌, మ్యాట్‌ ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో  అందుబాటులో ఉంది. కరిజ్మా XMR.. యమహా R15 V4, సుజుకీ Gixxer SF 250, బజాజ్‌ పల్సర్‌ RS 200, KTM RC 200లకు పోటీగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని