Social Media: ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్‌’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి

Social Media: ఏటా జూన్‌ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్‌ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.

Updated : 01 Jul 2024 07:51 IST

న్యూయార్క్‌: ఏటా జూన్‌ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్‌ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. ఆన్‌లైన్లో తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా విద్వేషాలు, ఆందోళనలు చెలరేగే ముప్పు ఉంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారాన్ని పంచుకొనేముందు ఈ అయిదు ప్రశ్నలు వేసుకోండి:

1.ఆ సమాచారాన్ని ఎవరు రూపొందించారు?

2.దానికి మూలం ఏంటి?

3.దాన్ని మీతో ఎవరు పంచుకున్నారు?

4.మీరు ఎందుకు ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నారు?

5.అది తాజా సమాచారమేనా?

ఈ విషయాలను నిర్ధారించుకొంటే తప్పుడు సమాచారాన్ని నిరోధించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని