Paytm: పేటీఎం మర్చంట్స్‌కు.. నెలకు కేవలం రూ.35తో ఆరోగ్య బీమా

Paytm: ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం తన వ్యాపార భాగస్వాముల కోసం పేటీఎం ఫర్‌ బిజినెస్‌ పేరుతో బీమా పాలసీని తీసుకొచ్చింది.

Published : 03 Jul 2024 23:20 IST

Paytm | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం (Paytm) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. తన వ్యాపార భాగస్వాముల కోసం ప్రత్యేక బీమాను తీసుకొచ్చింది. వారి సంక్షేమానికి భరోసా కల్పించేందుకు ‘పేటీఎం హెల్త్‌ సాథీ’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ తన స్టాక్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కొత్త ప్లాన్‌ పేటీఎం ఫర్‌ బిజినెస్‌ యాప్‌లో అందుబాటులో ఉందని పేటీఎం తెలిపింది.

తన వ్యాపార భాగస్వాముల కోసం హెల్త్‌ సాథీని తీసుకురావడంపై పేటీఎం అధిపతి విజయ్‌ శేఖర్‌ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. సమగ్ర ఆరోగ్య సదుపాయాల్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. దీని సబ్‌స్క్రిప్షన్‌ నెలకు కేవలం రూ.35 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. హెల్త్‌ సాథీతో అన్‌లిమిటెడ్‌ డాక్టర్‌ టెలీకన్సల్టేషన్‌, ఇన్‌- పర్సన్‌ డాక్టర్‌ విజిట్‌ (OPD) వంటి అనేక సేవలు పొందొచ్చని వెల్లడించింది. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాల కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడిన సమయంలో ఈ బీమా ఆదాయ రక్షణ కవరేజీని అందిస్తుంది. 

సీఎంఎఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక

డాక్టర్ టెలికన్సల్టేషన్‌ను MediBuddy ద్వారా పొందొచ్చు. ప్రముఖ ఫార్మసీలో మందులు కొనుగోలు చేయాలన్నా, రోగనిర్ధారణ పరీక్షల్లో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలు వినియోగించుకోవచ్చు. యాప్‌ సాయంతో క్లెయిమ్‌ ప్రాసెస్‌ సులభంగా పూర్తి చేయొచ్చని పేటీఎం పేర్కొంది. పేటీఎం హెల్త్‌ సాథీ ఫైలట్‌ ప్రోగ్రామ్‌ను మేలో ప్రారంభించామని, ఇప్పటికే 3,000 మంది వ్యాపార భాగస్వాములు ఈ సదుపాయాలను వినియోగించుకున్నారని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సేవల్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా తన బిజినెస్‌ పార్ట్‌నర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని