OnePlus Nord CE4 Lite 5G: ₹20వేలకే వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. CE4 Lite విశేషాలివీ..

OnePlus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్‌ సీఈ 4 లైట్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Published : 25 Jun 2024 00:05 IST

OnePlus Nord CE4 Lite 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (Oneplus) నార్డ్‌ సిరీస్‌లో సీఈ 4 లైట్‌ (Nord CE4 Lite 5G) ఫోన్‌ను విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన నార్డ్‌ సీఈ3 లైట్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 5,500 ఎంఏహెచ్‌ బిగ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి మెరుగైన ఫీచర్లతో రూ.20వేల్లోపే ఈ ఫోన్ తీసుకువచ్చారు. తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ ఫోన్ కోరుకునే వారు ఈ ఫోన్‌పై ఓ లుక్కేయొచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ పేర్కొంది. మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్‌, అల్ట్రా ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది. మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్‌ ఫోన్లు జూన్‌ 27 నుంచి అమెజాన్‌, వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. అల్ట్రా ఆరెంజ్‌ ఫోన్‌ సేల్‌ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

బైజూస్‌లో ₹4 వేల కోట్ల పెట్టుబడి.. ఇప్పుడు సున్నా..!

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 లైట్ 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ స్క్రీన్‌తో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ ఉంది. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14తో వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా ఇచ్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో ఇది వస్తోంది. 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంది. ముందు వైపు ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌తో కూడిన 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80W సూపర్‌ వూక్‌ పాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని