Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ ఆమోదం.. రూ.7,250 కోట్ల సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

Ola Electric: సెబీ నుంచి ఐపీఓ అనుమతి పొందిన తొలి ఈవీ స్టార్టప్‌గా ఓలా ఎలక్ట్రిక్‌ అవతరించింది.

Published : 20 Jun 2024 15:35 IST

Ola Electric | దిల్లీ: విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. డిసెంబర్‌లో ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ కోసం ప్రాథమిక పత్రాలు సమర్పించింది. సెబీ నుంచి ఐపీఓ కోసం అనుమతి పొందిన తొలి ఈవీ స్టార్టప్‌ ఇదే కావడం గమనార్హం.

ఐపీఓ ద్వారా మొత్తం రూ.7,250 కోట్లు సమీకరించాలని ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.5,500 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 9.52 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఓలా ఎలక్ట్రిక్‌ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్ 47.3 మిలియన్‌ షేర్లను, సంస్థ ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన ఆల్ఫావేవ్‌, ఆల్పైన్‌, మ్యాట్రిక్స్‌ 47.89 మిలియన్‌ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో విక్రయించనున్నారు.

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయం, రుణ చెల్లింపులు, పరిశోధన- అభివృద్ధి సహా కంపెనీ విస్తరణ, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) తెలిపింది. ఈవీలు సహా బ్యాటరీ ప్యాక్‌లు, మోటార్లు వంటి కీలక ఈవీ పరికరాలను ఈ కంపెనీ తయారుచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని