LPG commercial cylinder Price: తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..

LPG commercial cylinder Price: ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.32 తగ్గడం గమనార్హం.

Updated : 01 Jul 2024 11:23 IST

దిల్లీ: వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు ఊరటనిస్తూ చమురు మార్కెట్‌ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి (LPG commercial cylinder Price). 19 కిలోల సిలిండర్‌ ధర గరిష్ఠంగా రూ.32 వరకు తగ్గింది. దిల్లీలో ప్రస్తుత ధర రూ.1,646కు దిగొచ్చింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

కొన్ని నెలలగా వాణిజ్య సిలిండర్‌ ధర (LPG commercial cylinder Price) తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జూన్‌ 1న 19 కిలోల సిలిండర్ ధరను రూ.69.50 తగ్గించారు. అంతకుముందు మే 1న కూడా ధరను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధిక నిర్వహణ వ్యయాలతో సతమతమవుతున్న హోటళ్లు, రెస్టారంట్లు సహా ఇతర వ్యాపారులకు దీంతో ఊరట లభిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డిమాండ్‌- సరఫరా, పన్ను విధానాల ఆధారంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ప్రతీనెలా సవరిస్తుంటారు. తాజా తగ్గింపునకు గల కారణాలను మాత్రం కంపెనీలు ప్రత్యేకంగా వెల్లడించలేదు. కానీ, సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌లో స్థిరత్వం కారణంగానే ధరలు దిగొస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గృహవినియోగ సిలిండర్‌ ధరలను మాత్రం కంపెనీలు సవరించలేదు. హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.855, విజయవాడలో రూ.844, విశాఖపట్నంలో రూ.811గా ఉంది. మరోవైపు లీటర్‌ పెట్రోల్‌ ధర హైదరాబాద్‌లో రూ.107.41, విజయవాడలో రూ.109.73, విశాఖపట్నంలో రూ.108.29గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర వరుసగా.. రూ.95.65, రూ.97.56, రూ.96.17గా కొనసాగుతోంది. 

ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండన్‌ కొత్త ధరలు..

  • హైదరాబాద్‌ - రూ.1,872
  • విజయవాడ - రూ.1,832
  • విశాఖపట్నం - రూ.1,704
  • ముంబయి - రూ.1,598
  • కోల్‌కతా - 1,756
  • చెన్నై - రూ.1,809
  • బెంగళూరు - రూ.1,724
  • తిరువనంతపురం - రూ.1,676
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు