Google Chrome: క్రోమ్‌లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడనున్నాయంటే?

Google Chrome: మెరుగైన సెర్చ్‌ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా గూగుల్‌ క్రోమ్‌ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. అవేంటంటే?

Updated : 28 Jun 2024 16:08 IST

Google Chrome | ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రౌజర్‌ అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome). మెరుగైన సెర్చ్‌ అనుభవాన్ని అందించడం కోసం గూగుల్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తుంటుంది. తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. 

₹21 లక్షల కోట్లకు రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌.. తొలి భారతీయ కంపెనీగా చరిత్ర

క్రోమ్‌లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్లివే

  • క్రోమ్‌ ఏదైనా రెస్టరంట్‌ కోసం వెతికే సమయంలో బ్రౌజర్‌ మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఉదాహరణకు.. మీరు ఏదైనా రెస్టారంట్‌ కోసం సమాచారం వెతుకుతుంటే సెర్చ్‌ బార్‌ దగ్గర కొత్తగా మూడు కొత్త షార్ట్‌కట్‌ బటన్‌లు  కనిపిస్తాయి. వాటి సాయంతో ఆ రెస్టరంట్‌ ఫోన్‌ నంబర్‌, రూట్‌ మ్యాప్‌, రివ్యూస్‌ సింగిల్‌ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఐఫోన్‌ యూజర్లు వినియోగించకోవచ్చు.

  • గూగుల్‌ మెటీరియల్‌ యూ డిజైన్‌ లాంగ్వేజ్‌కు అనుగుణంగా టాబ్లెట్లలోని క్రోమ్‌ బ్రౌజర్‌లో అడ్రస్‌ బార్‌ను రీడిజైన్‌ చేశారు. సెర్చ్‌ చేస్తున్న సమయంలోనూ యూజర్లకు సెర్చ్‌ బార్‌ కిందనే డ్రాప్‌ డౌన్‌ కనిపిస్తుంది. అందులో ఇటీవల చూసిన వెబ్‌సైట్లు, మీరు వెతుకుతున్న విషయానికి సంబంధించిన ఇతర అంశాలు కనిపిస్తాయి. 
  • ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ట్రెండింగ్‌ సెర్చెస్‌ ఫీచర్‌ను ఇప్పుడు ఐఫోన్‌లోకి తీసుకొచ్చారు. యాపిల్‌ యూజర్లు కూడా సెర్చ్‌ బార్‌పై క్లిక్‌ చేస్తే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాల జాబితా కనిపిస్తుంది. 
  • డిస్కవర్ ఫీడ్‌లో కొత్తగా లైవ్ స్పోర్ట్స్ కార్డ్‌లు కనిపించనున్నాయి. మీరు గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్‌ కార్డులు ఇందులో కనిపిస్తాయి. మూడు చుక్కలను మెనూని ఉపయోగించి డిస్కవర్‌ ఫీచర్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. 
  • రైళ్లు, బస్సు వేళలకు సంబంధించిన షెడ్యూల్‌ వివరాలను ఇకపై క్రోమ్‌ సెర్చ్‌లో పొందొచ్చు. సెర్చ్‌ బార్‌లో షెడ్యూల్‌ అని టైప్‌ చేయగానే.. మీరున్న ప్రాంతానికి చెందిన రవాణా సర్వీసుల షెడ్యూల్‌ వెబ్‌సైట్‌ సజెషన్స్‌లో వస్తుంది.

గమనిక: ఈ ఫీచర్లు ఇంకా అన్ని ప్రాంతాల వారికి, యూజర్లకు అందుబాటులోకి రాలేదు. ప్రయోగాత్మకంగా కొంతమందికే ఈ ఫీచర్లు పని చేస్తున్నాయి. త్వరలో గూగుల్‌ పూర్తిస్థాయిలో ఈ సదుపాయాలను అందిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని