Netflix: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి త్వరలో ఫ్రీ ప్లాన్..?

Netflix: ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ త్వరలో ఓ ఫ్రీ ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం!

Published : 26 Jun 2024 00:06 IST

Netflix | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ స్ట్రీమింగ్‌ యాప్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) తన సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను పెంచుకునే దిశగా ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్రీ ప్లాన్‌ (Free plan) తీసుకురావాలనుకుంటోంది. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, కంటెంట్‌ను చూడాలంటే యాడ్స్‌ను కూడా వీక్షించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ప్లాన్‌ను తీసుకొస్తారని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక వెల్లడించింది.

ఆసియాతో పాటు యూరోపియన్‌ దేశాల్లో ఈ ఫ్రీ ప్లాన్‌ను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. టీవీ ఛానెల్స్‌ ఉచితంగా లభిస్తున్న దేశాల్లో ఈ ఫ్రీ ప్లాన్‌ను తేవాలని  ఆలోచన చేస్తోంది. ఏయే దేశాల్లో తీసుకొచ్చేదీ మాత్రం బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించలేదు. కెన్యాలో ఇప్పటికే ఈ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించి.. ఆపై నెట్‌ఫ్లిక్స్‌ నిలిపివేసింది. అమెరికాలో మాత్రం ఈ ప్లాన్‌ తీసుకొచ్చే ఉద్దేశమేదీ లేదని పేర్కొంది. 

ఈ-టికెట్ల బుకింగ్‌.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన

నెట్‌ఫ్లిక్స్‌ తన ఆడియన్స్‌ను పెంచుకోవడంలో భాగంగానే ఈ వ్యూహం అమలు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎవరైతే డబ్బులు చెల్లించి కంటెంట్‌ను వీక్షించలేరో వారిని యాడ్స్‌తో కూడిన ఫ్రీ ప్లాన్‌ ద్వారా చేరువ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రకటనల ఆదాయం కూడా పెంచుకోవడానికి దోహద పడుతుంది. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌ ఓ వైపు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పెంచుకోవడంపై దృష్టిసారిస్తుండగా.. అడ్వర్టైజ్‌మెంట్‌ ఆదాయాన్ని పెంచుకోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ ఫోకస్‌ పెట్టనుంది. దీనిపై అధికారికంగా నెట్‌ఫ్లిక్స్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. భారత్‌లో ప్రస్తుతానికి నెలకు రూ.149కి మొబైల్‌ ప్లాన్, రూ.199కి బేసిక్‌ ప్లాన్‌తో పాటు మరో రెండు ప్లాన్లను నెట్‌ఫ్లిక్స్‌ విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు