Naresh Goyal: నరేశ్‌ గోయల్‌ సతీమణి కన్నుమూత

కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్‌ గోయల్‌ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. 

Updated : 16 May 2024 10:10 IST

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ (Naresh Goyal)కు సతీవియోగం కలిగింది. ఆయన భార్య అనితా గోయల్ గురువారం ఉదయం కన్నుమూశారని కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత కొద్దికాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధడుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. మరోపక్క నరేశ్‌ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయనకు (Naresh Goyal) ఇటీవలే బెయిల్‌ మంజూరైంది. తనతోపాటు తన భార్య అనిత కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నందున బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన బాంబే హైకోర్టు.. రెండు నెలల తాత్కాలిక ఊరట కల్పించింది.

‘ఆశలన్నీ కోల్పోయా.. చనిపోవడం మేలు..!’ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు కన్నీరుమున్నీరు

దేశీయ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్‌ గోయల్‌ను అరెస్టు చేసింది.  అదే ఏడాది నవంబర్‌లో గోయల్‌ భార్యను అరెస్ట్‌ చేసినప్పటికీ.. ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగా ప్రత్యేక కోర్టు అదేరోజు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని