Motorola Razr 50 Ultra: 12GB ర్యామ్‌తో మోటో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లివే..

Motorola Razr 50 Ultra: మోటోరోలా నుంచి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ వచ్చింది. 12జీబీ ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 04 Jul 2024 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా (Motorola Razar 50 Ultra) స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. కొత్త వెర్షన్‌ను మరింత పెద్ద డిస్‌ప్లే, మెరుగైన డిజైన్‌, ఐపీ రేటింగ్‌, కొత్త హార్డ్‌వేర్‌తో తీర్చిదిద్దారు. ఫోన్‌తో పాటు కంపెనీ కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌నూ ఇస్తుండడం విశేషం. రిటైల్‌ బాక్స్‌లో ఫోన్‌ కేస్‌ కూడా ఉండడం గమనార్హం. ఇతర ఫోల్డబుల్‌ ఫోన్‌ బ్రాండ్లేవీ వీటిని ఆఫర్‌ చేయడం లేదు. ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

రేజర్‌ 50 అల్ట్రా ఫీచర్లు..

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా (Motorola Razr 50 Ultra) క్వాల్‌కామ్‌ కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గత వెర్షన్‌తో పోలిస్తే పరిమాణంలో తెర పెద్దగా, సన్నని అంచులతో వస్తోంది. ప్రధాన తెర ఫుల్‌హెచ్‌డీ+ పీఓలెడ్‌, 165Hz రీఫ్రెష్‌ రేటుతో 6.9 అంగుళాల (2640 x 1080) పరిమాణంలో ఉంది. బయటి తెర నాలుగు అంగుళాల (1272 x 1080) పరిమాణంలో ఎల్‌టీపీఓ, ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌, 165Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఫోన్‌ను ఫోల్డ్‌ చేసినప్పుడు వీడియోలు చూడడం, నావిగేషన్‌ వివరాలు, సెల్ఫీలు తీసుకోవడం వంటి పనులు బయటి స్క్రీన్‌తోనే చేసేయొచ్చు.

కెమెరా విషయంలో రేజర్‌ 50 అల్ట్రాను (Motorola Razr 50 Ultra) మెరుగ్గా అప్‌గ్రేడ్‌ చేశారు. 50MP, f/1.7 ప్రధాన కెమెరా, 50MP, f/2.0 టెలిఫొటో సెన్సర్‌, 2x ఆప్టికల్‌ జూమ్‌ సెటప్‌ను ఇచ్చారు. 30X ఏఐ సూపర్‌ జూమ్‌, ఏఐ యాక్షన్‌ షాట్‌, ఏఐ అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, ఇంటెలిజెంట్‌ ఆటో ఫోకస్‌ ట్రాకింగ్‌ వంటి కెమెరా ఏఐ ఫీచర్లు ఉన్నాయి. లోపలి డిస్‌ప్లేపై 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీని ఇచ్చారు. 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 5G, 6/6E, 7, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఏజీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

రేజర్‌ 50 అల్ట్రా ధర..

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా (Motorola Razr 50 Ultra) 12 GB ర్యామ్‌ + 512 GB స్టోరేజీ ధర రూ.99,999. విడుదల సందర్భంగా రూ.5,000 రాయితీ లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5,000 అదనపు రాయితీ కూడా ఉంది. ఫలితంగా ధర రూ.89,999కు దిగొస్తుంది. జులై 20 నుంచి అమెజాన్‌, రిలయన్స్‌ స్టోర్లతో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. జులై 10 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. మిడ్నైట్‌ బ్లూ, స్ప్రింగ్‌ గ్రీన్‌, పీచ్‌ ఫజ్‌ రంగుల్లో లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని