బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి!

అనేక రంగాల్లో తన సత్తా చాటిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తాజాగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది.

Published : 22 Jun 2024 22:54 IST

AI Candidate In UK Elections | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI).. ఈ సాంకేతికత వినియోగం శరవేగంగా పెరుగుతోంది. వర్చువల్‌ అసిస్టెంట్లు, ఆటోమేటెడ్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్ల నుంచి న్యూస్‌ యాంకర్లు, వర్చువల్‌ టీచర్ల వరకు ఈ సాంకేతికత అన్నింటా అద్భుతమైన పనులు చేసేస్తోంది. ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అవునండీ మీరు విన్నది నిజమే? తొలిసారి ఏఐ అభ్యర్థి జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎక్కడో తెలుసా?

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు జులై4 న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వ్యాపారవేత్త స్టీవ్‌ కాట్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. అయితే తన స్థానంలో ఏఐ అభ్యర్థిని నిలబెట్టాలనే వినూత్న ఆలోచన వచ్చింది. దీంతో తన ఫొటో సాయంతో రూపొందించిన ఏఐ అవతార్‌ను వినియోగించారు. ‘‘ఏఐ స్టీవ్‌’’ పేరుతో నామినేషన్‌ ఫారమ్‌ను సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ వర్చువల్‌ అభ్యర్థి కాట్‌ తరపున నిలబడనుంది. ప్రచారంలో పాల్గొంటుంది. ఈ ఎన్నికల్లో ఏఐ స్టీవ్‌ గెలిస్తే.. వర్చువల్‌ అభ్యర్థికి బదులుగా కాట్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌..డీప్‌ఫేక్‌ వీడియోల ఆటకట్టు

ఈ సంచలన నిర్ణయంతో బ్రిటన్‌ ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అదే సమయంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఎన్నికల తర్వాత పార్టీని స్థాపించి.. దేశవ్యాప్తంగా ఏఐ అభ్యర్థులను తీసుకొస్తానని స్టీవ్‌ చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలతో విసుగుచెంది.. ‘బ్రైటన్‌ పవిలియన్‌’ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడినట్టు తెలిపారు. ఏఐ స్టీవ్‌ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలపై పరిష్కారాలు సూచిస్తుంది, ప్రజల నుంచి సూచనల్ని తీసుకుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2022లో కన్జర్వేటీవ్‌ పార్టీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీచేసిన స్టీవ్‌ ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు