Threads: ఏడాదిలోనే థ్రెడ్స్‌కు 175 మిలియన్ల యూజర్లు.. భారత్‌లోనే అధికం

Threads: ప్రముఖ సామాజిక మాధ్యమం థ్రెడ్స్‌ వినియోగంలోకి వచ్చిన ఏడాదిలోనే 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్‌ యూజర్లను సొంతం చేసుకుంది.

Published : 04 Jul 2024 21:25 IST

Threads | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎక్స్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘థ్రెడ్స్‌’ (Threads) పెద్ద ఎత్తున యాక్టివ్‌ యూజర్లను సొంతం చేసుకుంది. వినియోగంలోకి తీసుకొచ్చిన ఏడాదిలోనే ఏకంగా 175 మిలియన్ల యూజర్‌ మార్క్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. యూజర్లు తమ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకొనేందుకు థ్రెడ్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.

థ్రెడ్స్‌లో 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఇందులో భారత వినియోగదారులే అధికమని పేర్కొంది. భారత్‌ అత్యంత యాక్టివ్‌ మార్కెట్‌ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) పేర్కొన్నారు. సంఖ్య ఎంతనేది మాత్రం మాత్రం వెల్లడించలేదు. థ్రెడ్స్‌ వేదికగా సినిమాలు, టెలివిజన్‌, ఓటీటీ కంటెంట్, స్పోర్ట్స్‌ సంబంధించిన అంశాలు ఎక్కువగా పంచుకుంటున్నారని మోటా తెలిపింది.

స్టీవ్‌ జాబ్స్‌తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్‌ మాజీ డిజైనర్‌

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌’కు పోటీగా మెటా థ్రెడ్స్‌ను గతేడాది జులై 6న మెటా తీసుకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన వెంటనే లక్షల్లో ఖాతా తెరిచారు. తర్వాత దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)కు అనుసంధానం చేశారు. ఇది యూజర్లు పెరగడానికి సాయపడింది. తర్వాత దీని వినియోగం కాస్త తగ్గముఖం పట్టింది. వినియోగదారులకు అభిరుచుల మేరకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందకు ఈ ప్లాట్‌ఫామ్‌ సిద్ధమవుతోంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని