LIC: ఎల్‌ఐసీ ‘జీవన్‌ సమర్థ్‌’ ప్రాజెక్టు

తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్‌ సమర్థ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గురువారం ప్రకటించింది.

Published : 05 Jul 2024 03:59 IST

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పరివర్తనే లక్ష్యం

దిల్లీ: తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్‌ సమర్థ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గురువారం ప్రకటించింది. దీన్ని సాధించేందుకు అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత  నిబంధనలను పూర్తిస్థాయిలో సమీక్షిస్తారు. వేగంగా మారుతున్న పరిశ్రమ తీరు, బీమా రంగం నిబంధనావళి నేపథ్యంలో అంతర్జాతీయ ఉత్తమ విధానాలను అందుకునే దిశగా శాఖ, డివిజన్, జోనల్‌ స్థాయిల్లో సంస్థ కార్యకలాపాలను పునర్‌ వ్యవస్థీకరణ చేసుకోవాల్సి ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. ‘కోట్ల  సంఖ్యలోని భారతీయ కుటుంబాల అవసరాలకు తగ్గట్లు, వారికి సరిపోయేలా దీర్ఘకాల పొదుపు, భద్రత, ఆరోగ్య బీమా, యులిప్, పింఛన్‌ పరిష్కారాలను అందించే లక్ష్యంతోనే జీవన్‌ సమర్థ్‌ ప్రాజెక్టును చేపట్టామ’ని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని