Jio Safe- Jio Translate: జియో సేఫ్‌, జియో ట్రాన్స్‌లేట్‌.. ఎలా పనిచేస్తాయ్‌..?

Jio Safe- Jio Translate: రిలయన్స్‌ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్‌, రెండోది జియో ట్రాన్స్‌లేట్‌.

Published : 30 Jun 2024 00:05 IST

Jio Safe- Jio Translate | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) మరో రెండు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త టారిఫ్‌లతో పాటు వీటిని కూడా ప్రకటించింది. అవే జియో సేఫ్‌ (Jio Safe), జియో ట్రాన్స్‌లేట్‌ (Jio Translate). నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ సర్వీసులు పనిచేస్తాయి. ఇందులో జియో సేఫ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.199 కాగా.. జియో ట్రాన్స్‌లేట్‌ ధరను రూ.99గా పేర్కొంది. జియో యూజర్లతో పాటు ఇతరులు కూడా వీటిని వాడుకోవచ్చు. జియో యూజర్లకు వీటిని ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు జియో పేర్కొంది. ఇంతకీ ఏమిటివి? ఈ సర్వీసులు ఎలా పనిచేస్తాయ్‌?

జియో సేఫ్‌: ఇది వాయిస్‌, వీడియో, కాన్ఫరెన్స్‌ కాలింగ్‌కు సంబంధించిన కమ్యూనికేషన్‌ యాప్‌. సింపుల్‌గా చెప్పాలంటే జూమ్‌ తరహాలో ఇది పనిచేస్తుంది. ఏదైనా మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ అవ్వొచ్చు. ఐదుగురు సభ్యులు గ్రూప్‌ కాలింగ్‌లో సంభాషించొచ్చు. ఇందులో వాయిస్‌, వీడియో కాల్స్‌ పూర్తి సెక్యూర్‌ అని జియో చెబుతోంది. 

జియో ట్రాన్స్‌లేట్‌: ఇది అనువాదానికి సంబంధించిన యాప్‌. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, గుజరాతీ, మరాఠీ వంటి 12 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. మీ మాటలను టెక్ట్స్‌ రూపంలోకి ఈ యాప్‌ ద్వారా కన్వర్ట్ చేయొచ్చు. వాయిస్‌ కాల్‌లో ఉంటూనే ఆడియోను ట్రాన్సలేట్‌ చేయొచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాతృభాషలోనే సంభాషిస్తూనే అవతలి వారికి తమ భావాలను వ్యక్తపరొచ్చు. ఇన్‌స్టంట్‌ వాయిస్‌ ట్రాన్సలేట్‌ ఆప్షన్‌ ఇందులో ఉంది. పర్యటకులకు ఈ యాప్‌ అనువుగా ఉంటుందని జియో చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని