Today Stock Market: మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు

బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి.

Updated : 02 Jul 2024 06:55 IST

బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.51% లాభంతో 85.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలు నమోదుచేశాయి. 

  • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల తాజా గరిష్ఠమైన రూ.443.05 లక్షల కోట్ల (5.31 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 79,043.35 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. కొనుగోళ్ల జోరుతో లాభాలు కొనసాగించిన సూచీ, 79,561 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 443.46 పాయింట్ల లాభంతో 79,476.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 131.35 పాయింట్లు పెరిగి 24,141.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,992.70- 24,164 పాయింట్ల మధ్య కదలాడింది.

సిమెంట్‌ షేర్ల దూకుడు: కంపెనీల విలీనాలు- కొనుగోళు జరుగుతుండటం, భవిష్యత్తులో గిరాకీ బలంగా ఉండొచ్చన్న అంచనాలతో సిమెంట్‌ కంపెనీల షేర్లు రాణించాయి. ఓరియెంట్‌ సిమెంట్‌ 14.28%, ఏసీసీ  5.06%, అంబుజా సిమెంట్స్‌ 3.68%, అల్ట్రాటెక్‌ 2.11%, దాల్మియా భారత్‌ 1.91%, శ్రీ సిమెంట్‌ 1.79% చొప్పున లాభపడ్డాయి.

  • డెరివేటివ్స్‌ ట్రేడింగ్, నిఫ్టీ-50 సూచీలోకి చేరొచ్చన్న వార్తలతో జొమాటో షేరు 1.85% లాభపడి రూ.204.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.207.30 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది.
  • సెన్సెక్స్‌ సూచీలో 20 పరుగులు తీశాయి. టెక్‌ మహీంద్రా 2.94%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.24%, అల్ట్రాటెక్‌ 2.11%, టీసీఎస్‌ 1.75%, ఇన్ఫోసిస్‌ 1.46%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.35%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.26%, టాటా మోటార్స్‌ 1.17%, హెచ్‌యూఎల్‌ 1.09%, ఐటీసీ 1.04%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.03% లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఐటీ 1.84%, టెక్‌ 1.46%, కమొడిటీస్‌  1.21%, టెలికాం 1.03%, పరిశ్రమలు 0.95%, లోహ 0.73% పెరిగాయి. యుటిలిటీస్, విద్యుత్, స్థిరాస్తి నీరసించాయి. బీఎస్‌ఈలో 2656 షేర్లు లాభపడగా, 1346 స్క్రిప్‌లు నష్టపోయాయి. 144 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని