Instagram: ఇన్‌స్టా కొత్త ఫీచర్‌.. లైవ్‌స్ట్రీమ్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే!

Instagram: యూజర్ల గోప్యతను మరింత పెంచేలా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. లైవ్‌స్ట్రీమ్‌ కావాలనుకున్న వారికి మాత్రమే కనిపించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Published : 21 Jun 2024 14:39 IST

Instagram | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆన్‌ లైవ్‌’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో యూజర్లు తమకు కావాల్సిన వారిని జత చేయడం లేదా తొలగించేందుకు అనుమతి ఉంటుంది.

ఇప్పటివరకు ఇన్‌స్టా లైవ్‌ ఫాలోవర్లందరికీ కనిపించేది. అకౌంట్‌ పబ్లిక్‌ అయితే, ఎవరైనా స్ట్రీమింగ్‌లో జాయిన్‌ అయ్యే వీలుండేది. కొత్తగా తీసుకొచ్చిన ఆప్షన్‌తో (Close Friends on Live) ఇకపై ఎవరు తమ లైవ్‌ను వీక్షించొచ్చో యూజర్లే నియంత్రిస్తారు. ఇన్‌స్టా వేదికపై సంభాషణల్లో మరింత గోప్యత తీసుకురావడంలో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు మాతృసంస్థ మెటా వెల్లడించింది.

యూజర్లు వారి కంటెంట్‌ గ్రిడ్‌లోని పోస్ట్‌లను కేవలం సన్నిహిత స్నేహితుల కోసం మాత్రమే మార్క్‌ చేసేలా ఇన్‌స్టా (Instagram) నవంబర్‌లోనే మార్పులు చేసింది. బ్యాటరీ సేఫ్టీ సెట్టింగ్స్‌లో భాగంగా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాకుండా మిగతా అందరినీ మ్యూట్‌ చేసే ఆప్షన్‌ను కూడా గతంలోనే తీసుకొచ్చింది. ఈ ఫీచర్లన్నీ కేవలం క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అందరూ వీటిని వాడుకోవచ్చు. మరోవైపు నోట్స్‌ ఫీచర్‌ కూడా ఫాలోవర్లు, ఫ్రెండ్స్‌తో ప్రైవేట్‌గా కనెక్ట్‌ అయ్యేందుకు ఒక ఆప్షన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని