చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్థిక శాఖ ప్రకటన

Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. 

Updated : 28 Jun 2024 20:25 IST

Small savings schemes | దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికానికి గానూ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల (small saving schemes) వ‌డ్డీ రేట్లను య‌థాత‌థంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. పాత వడ్డీ రేట్లే జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఉంటాయని పేర్కొంది. 

క్రోమ్‌లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడనున్నాయంటే?

ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1%, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)పై 7.1%, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, కిసాన్ వికాస్ పత్రపై 7.5% శాతం ఉంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC) 7.7%, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది. ఈ వడ్డీ రేట్లే సెప్టెంబరుతో ముగిసే త్రైమాసికం వరకు ఉంటాయని పేర్కొంది. ఇక పీపీఎఫ్‌ వడ్డీ రేటును 2020 ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికం నుంచి ఇప్పటివరకు మార్చలేదు. ఈ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికానికోసారి ప్రభుత్వం స‌వ‌రిస్తుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని