Fixed Deposits: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ బ్యాంక్‌

ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ రూ.3 కోట్ల వరకు ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

Published : 29 Jun 2024 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు 2024 జూన్‌ 29 నుంచి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంకు వెబ్‌సైట్‌ తెలిపింది. 7 నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై కనిష్ఠంగా 3% వడ్డీని పొందనుండగా.. ఇదే కాలవ్యవధి డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 3.50% వడ్డీ పొందుతారు. సాధారణ డిపాజిటర్లు 15 నెలల నుంచి 18 నెలల లోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 7.20% వడ్డీ పొందనుండగా, సీనియర్‌ సిటిజన్లు ఇదే కాలవ్యవధికి గరిష్ఠంగా 7.75% వరకు వడ్డీ పొందుతారు. సాధారణ డిపాజిటర్లు 5 ఏళ్ల ట్యాక్స్‌ సేవర్‌ ఎఫ్‌డీపై 7% వడ్డీ పొందనుండగా.. ఇదే కాలవ్యవధి డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 7.50% వరకు వడ్డీని అందిస్తామని బ్యాంక్‌ ప్రకటించింది. ఈ వడ్డీ రేట్లు రూ.3 కోట్ల వరకు ఉన్న డిపాజిట్లపై వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని