యూపీఐ, యూట్యూబ్‌తో నోకియా 3 ఫీచర్‌ ఫోన్లు

Nokia mobiles: నోకియా బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్‌ సంస్థ.. మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Updated : 27 Jun 2024 13:39 IST

Nokia mobiles | ఇంటర్నెట్‌డెస్క్‌: నోకియా (Nokia) బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్‌ సంస్థ.. మూడు కొత్త ఫీచర్‌ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో పాటు నోకియా 235 4జీ (Nokia 235 4G), నోకియా 220 4జీ (Nokia 220 4G) పేరిట మరో రెండు ఫోన్లనూ తీసుకొచ్చింది. యూట్యూబ్‌, యూపీఐ ఫీచర్లతో ఈ ఫోన్లు వస్తుండడం విశేషం.

నోకియా 3210 ఫోన్‌లో 1450mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 9:30 గంటల పాటు టాక్‌ టైం వస్తుందని కంపెనీ చెబుతోంది. ఫీచర్‌ ఫోన్లు ఎప్పటికీ గుర్తుండే స్నేక్‌ గేమ్‌, 2ఎంపీ కెమెరా, ఫ్లాష్‌ టార్చ్‌ సదుపాయం కలిగి ఉంటుంది. అంతే కాదు స్మార్ట్‌ఫోన్‌ తరహా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. అంటే ఎక్కడైనా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పే చేసేయొచ్చు. యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌తో పాటు వెధర్‌, న్యూస్‌, క్రికెట్‌ స్కోర్‌, 2048 గేమ్‌తో సహా 8 యాప్స్‌ ఇచ్చారు. దీని ధర రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది. స్కూబా బ్లూ, బ్లాక్‌, Y2k గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది.

పైసా ఆదాయం లేకుండా ట్రేడింగ్‌.. ₹26 లక్షలు పోగొట్టుకున్న బీటెక్‌ విద్యార్థి!

నోకియా 235 4జీలో 2.8 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే, 2 ఎంపీ కెమెరా అమర్చారు. దీని ధర రూ.3,749గా కంపెనీ పేర్కొంది. బ్లూ, బ్లాక్‌, పర్పల్‌ రంగుల్లో లభిస్తుంది. నోకియా 220 4జీ ధర రూ.3,249గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌తో వస్తోంది. పీచ్‌, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ మూడు ఫోన్లూ యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌, యూపీఐ ఫీచర్లతో వస్తున్నాయి. హెచ్‌ఎండీ, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని