Himachal Pradesh Tourism: హిమాచల్‌లో హోటళ్లపై 20-40% రాయితీలు

వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు.

Updated : 03 Jul 2024 02:38 IST

శిమ్లా: వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో పర్యాటకుల రాక తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌పీటీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. హెచ్‌పీటీడీసీ హోటళ్లకు ప్రచారం పెంచడంతో పాటు, పర్యాటలకు రాయితీ ప్రయోజనాలను అందించడమే లక్ష్యమని తెలిపారు. హోటల్‌ స్పిటి (కాజ), హోటల్‌ కిన్నర్‌ కైలాశ్‌ (కల్పా), సన్‌ అండ్‌ స్నో కాటేజ్‌ (కల్పా), హోటల్‌ చాందర్‌భాగ (కీలాంగ్‌), హోటల్‌ శివాలిక్‌ (పర్వానూ), హోటల్‌ హమిర్‌ (హమిర్‌పూర్‌), లేక్‌ వ్యూ (బిలాస్‌పూర్‌), హోటల్‌ భాగల్‌ (దర్లాఘాట్‌), హోటల్‌ నూర్పూర్‌ (నూర్పూర్‌), హోటల్‌ బుషేసర్‌ రీజెన్సీ (రాంపూర్‌), సుకేత్‌ (సుందర్‌నగర్‌), హోటల్‌ విల్లీస్‌ పార్క్‌ (శిమ్లా)ల్లో ఈ రాయితీలు లభించవు. జులై 28 నుంచి ఆగస్టు 4 మధ్య మింజార్‌ ఫెయిర్‌ సమయంలో కొన్ని హోటళ్లలో రాయితీలు ఉండవనీ హెచ్‌పీటీడీసీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని