Hexaware: భారత్‌లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్‌

ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్‌ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది.

Updated : 03 Jul 2024 02:37 IST

దిల్లీ: ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్‌ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. ఇందులో భారత్‌లోనే 4,000 మందిని చేర్చుకోబోతున్నట్లు పేర్కొంది. నవీ ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థలో మొత్తం 30,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, పోలండ్, యూకేల్లో నూతన నియామకాలు చేపట్టనున్నట్లు హెగ్జావేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, టాలెంట్‌ సప్లై చైన్‌ గ్లోబల్‌ హెడ్‌ రాజేశ్‌ బాలసుబ్రమణియన్‌ వెల్లడించారు. దేశంలోని హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, దెహ్రాదూన్, బెంగళూరు, అహ్మదాబాద్, ఇందౌర్, పుణె, ముంబయి, చెన్నై, కొచి, తిరువనంతపురంలలో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. టెక్‌ లీడ్‌లు, ఆటోమేషన్‌ టెస్టింగ్‌ స్పెషలిస్ట్‌లు, ఏఈఎం ఆర్కిటెక్ట్‌లు, బిగ్‌ డేటా లీడ్‌లు, వర్క్‌డే ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగాలకు ప్రతిభావంతుల్ని ఎంపిక చేసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని