Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ నివాసాల్లో ED సోదాలు

హీరో మోటోకార్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజల్‌ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. డీఆర్‌ఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 01 Aug 2023 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ (Hero MotorCorp) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజల్‌ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు దిల్లీ సహా గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో రంగంలోకి దిగినట్లు తెలిసింది. పవన్‌ ముంజల్‌ సన్నిహితుల్లో ఒకరు సరైన పత్రాలు లేకుండా విదేశీ కరెన్సీ తరలిస్తూ డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడడంతో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. ఈడీ దాడుల సమాచారంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్‌

మరోవైపు హీరో మోటోకార్ప్‌ షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లిస్తున్నట్లు ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 17న ఓ కంపెనీతో హీరో మోటో కార్ప్‌కు ఉన్న సంబంధాలపై విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గతేడాది సైతం పన్ను ఎగవేత ఆరోపణలతో హీరో మోటోకార్ప్‌పై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. అయితే, రొటీన్‌ ఎంక్వైరీలో భాగంగానే ఈ సోదాలు జరిగాయని అప్పట్లో హీరో మోటోకార్ప్‌ వివరణ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని