Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు

Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ వాహన ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Published : 24 Jun 2024 14:07 IST

Hero MotoCorp | దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) తన వాహనాల ధరలను (Price hike) పెంచనుంది. ఎంపిక చేసిన మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్‌ సోమవారం తెలిపింది. గరిష్ఠంగా రూ.1500 వరకు ఈ పెంపు చేపడుతున్నట్లు పేర్కొంది. జులై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

ఉత్పత్తి వ్యయం పెరిగినందునే ధరలు పెంచాల్సి వచ్చిందని హీరో ఓ ప్రకటనలో తెలిపింది. మోడల్‌ను బట్టి, మార్కెట్‌ను బట్టి ఈ పెంపు ఉంటుందని తెలిపింది. హీరో సంస్థ స్ప్లెండర్‌, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, గ్లామర్‌ వంటి మోటార్‌ సైకిళ్లతో పాటు జూమ్‌, డెస్టినీ 125 ఎక్స్‌టెక్‌ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. హీరో మోటోకార్ప్ షేరు స్వల్ప లాభంతో రూ.5,477 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు