Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌పై ఎఫ్‌ఐఆర్‌.. షేర్లు డౌన్‌

FIR against Pawan Munjal: ఫోర్జరీ కేసులో హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతో హీరో షేర్లు నష్టపోయాయి.

Published : 09 Oct 2023 15:29 IST

FIR against Pawan munjal | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌పై (Pawan Munjal) దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నకిలీ బిల్లులతో పన్ను రాయితీలు పొందారని అందులో పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో హీరో మోటోకార్ప్‌ షేర్లు  3 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2009, 2010లో రూ.5.94 కోట్లకు సంబంధించి ఫోర్జరీ, మోసానికి ప్పాడ్డారంటూ పవన్‌ ముంజాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. హీరో మోటోకార్ప్‌ పేరిట నకిలీ బిల్లులు సృష్టించి, రూ.55.5 లక్షలు ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందారన్నది దాని సారాంశం. ఫేక్‌ బిల్లుల ద్వారా ప్రభుత్వాన్ని, ఆదాయపు పన్ను శాఖను మోసం చేశారని దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

ఇజ్రాయెల్‌- హమాస్‌ ఎఫెక్ట్‌.. పెరిగిన చమురు ధరలు!

మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్టులో ముంజాల్‌ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. 2018లో పవన్‌ ముంజాల్‌ లండన్‌ వ్యాపార పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను చూసేందుకు థర్డ్‌పార్టీ సేవల సంస్థకు చెందిన ఓ అధికారిని హీరో మోటోకార్ప్‌ నియమించుకుంది. ముంజాల్‌తో పాటు ఆ వ్యక్తి లండన్‌కు వెళ్లేందుకు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా.. ఈ వ్యక్తి బ్యాగేజీలో రూ.81 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు అక్కడి సిబ్బంది తనిఖీల్లో గుర్తించారు. దీంతో విదేశీ మారకపు నిర్వహణ చట్టం కింద ఈ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు జప్తు చేసి, కేసు నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ తనిఖీలు నిర్వహించింది. గతేడాది మార్చిలో కూడా పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఆదాయపు పన్ను అధికారులు ముంజాల్‌ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగమని అప్పట్లో కంపెనీ వివరణ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని