Hero Motocorp: హార్లే డేవిడ్‌సన్‌ X440 బుకింగ్స్‌ అదుర్స్‌

Hero Motocorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ ఇటీవల ఆవిష్కరించిన హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 వాహన బుకింగ్‌లో అదరకొట్టింది.

Published : 08 Aug 2023 13:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp), హార్లే డేవిడసన్‌ భాగస్వామ్యంలో తీసుకొచ్చిన ఎక్స్‌ 440 (Harley Davidson X440) బైక్‌ బుకింగ్స్‌కు అనూహ్య స్పందన వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు 25,597 యూనిట్లకు బుకింగ్స్‌ వచ్చినట్లు హీరో మోటోకార్ప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 4న వీటి బుకింగ్స్‌ ప్రారంభం కాగా.. తొలి విడత బుకింగ్‌ ప్రక్రియ ముగిసిందని పేర్కొంది. తొందర్లోనే రెండో విడత బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది.

రైల్లో లోయర్‌ బెర్త్‌ కావాలా? ఈసారి ఇలా చేయండి..

‘మేం తీసుకొచ్చిన హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 400 వాహనానికి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. టాప్‌ ఎండ్‌ మోడల్స్‌కే ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్‌ వచ్చాయి. సరైన బ్రాండ్‌, సరైన మోడల్‌ ఉంటే ఎక్కువ ధర వెచ్చించైనా వాహనాన్ని కొనటానికి వెనకాడరు అనడానికి ఈ బుకింగ్సే నిదర్శనం. ప్రీమియం సెగ్మెంట్‌లో ఇది మా మొదటి అడుగు మాత్రమే’ అని హీరో మోటార్‌ కార్ప్‌ సీఈఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. అక్టోబర్‌ నుంచి కస్టమర్‌ డెలివరీలు ఇవ్వనున్నారు. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని