Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌కు రూ.605 కోట్ల పన్ను నోటీసు

Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌కు ఐటీ శాఖ నుంచి రూ.605 కోట్లకు పన్ను నోటీసు వచ్చింది.

Published : 04 Apr 2024 17:53 IST

Hero MotoCorp | దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు (Hero MotoCorp) ఆదాయపు పన్ను శాఖ నుంచి పెద్ద మొత్తంలో పన్ను డిమాండ్‌ నోటీసు అందింది. ఆరు మదింపు సంవత్సరాలకు సంబంధించి రూ.308.65 కోట్లు, వడ్డీ రూ.296 కోట్లు కలిపి మొత్తం రూ.601 కోట్లకు సంబంధించి నోటీసు అందుకున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2014, 2015, 2016, 2017, 2018, 2020 మందిపు సంవత్సరాలకు సంబంధించి ఈ ట్యాక్స్‌ నోటీసులు అందుకున్నట్లు హీరో తెలిపింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక, సాధారణ, ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని